25 May, 2026 | 9:08 PM

నకిరేకంటి ప్రసాద్ పౌండేషన్ సేవలు అభినందనీయం

25-05-2026 08:06 PM

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

గరిడేపల్లి,(విజయక్రాంతి): నకరికంటి ప్రసాద్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం అని కొత్తగూడెం గ్రామ సర్పంచి సుధా నాగరాజు,బిఆర్ఎస్ మాజీ అధికార ప్రతినిధి రామ్ సైదులు అన్నారు.మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మాజీ సర్పంచ్ నకరికంటి ప్రసాద్ పౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉపాధి కూలీలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకి వెళ్ళవద్దని సూచించారు.