29 April, 2026 | 10:14 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు

29-04-2026 08:31 PM

కొండపాక: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని జల్లి పట్టకుండా గతంలో మాదిరిగానే ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి కి దుద్దెడ గ్రామ జిపిఓ ద్వారా వినతి పత్రం అందించారు. ప్రస్తుత వేసవి పరిస్థితులను దృశ్య  ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సరియైన వసతులు లేక ముఖ్యంగా కరెంటు సరిగా లేకపోవడం, సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయక, సెంటర్ కు తీసుకువచ్చిన ధాన్యాన్ని జల్లి పట్టుమనడం, సరియైన సదుపాయాలు అందుబాటులో లేకపోవడం తో రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. గత సీజన్ మాదిరిగా నే జల్లి పట్టకుండానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇట్టి విషయంపై త్వరగా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.