29 April, 2026 | 10:15 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఉపాధి హామీ పనులు ఉదయమే పూర్తి చేసుకోవాలి

29-04-2026 08:27 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఉదయం 9:00 నుండి వేసవి బాణుడు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఉపాధి హామీ పనులు ఉదయమే పూర్తి చేసుకోవాలని తెలిపారు. వేసవిలో ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు నిర్వహించుకోవాలని, ఎండలో పనులు చేసేటప్పుడు ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ కూలీలతో సమానంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ క్రింద కూర్చొని సలహాలు, సూచనలు తెలియజేయంతో పాటు వారితో చర్చించారు. అనంతరం ఫోటో క్యాప్చర్ చేసుకొని వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తిరుపతి,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నారు.