27 July, 2026 | 5:38 PM

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన

27-07-2026 04:43 PM

జిగురు అట్టలు తొడిగించు, పిచికారి మందుల ఖర్చు  తగ్గించు

కంగ్టి, 27(విజయక్రాంతి): మండల పరిధిలోని నాగూర్ (కే) గ్రామ శివారులో సోమవారం వ్యవసాయ విస్తీర్ణధికారి సంతోష్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాల్లో రసం పీల్చే పురుగులు, ప్రత్యేకించి దోమ ఉధృతిని గమనించి, రైతులకు దాని నివారణా చర్యలపై కీలక సూచనలు చేశారు.

పంట రక్షణకు ప్రతి రైతు తప్పనిసరిగా పసుపు, నీలం జిగురు అట్టలను వినియోగించాలని స్పష్టం చేశారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్ ఉదాహరణలతో జిగురు అట్టల ప్రాముఖ్యతను వివరించారు. పురుగుల మందుల పిచికారీ ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, ప్రారంభ దశలోనే దోమ ఉధృతిని అరికట్టడానికి జిగురు అట్టలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

యూరియా వాడకం తగ్గించాలి

అదేవిధంగా, పొలాల్లో యూరియా (నత్రజని) ఎరువులను పరిమితికి మించి వాడటం వల్ల మొక్కలు అతిగా పెరిగి, దోమ మరియు ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి తీవ్రమవుతుందని హెచ్చరించారు. అనవసరమైన యూరియా వాడకాన్ని తగ్గించాలి అని సూచించారు.