27 July, 2026 | 5:37 PM

పీజీ సీట్లు సాధించిన విద్యార్థులు

27-07-2026 04:43 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీకి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగ శర్మ సోమవారం తెలిపారు. తమ కళాశాలలో ఎంజెడ్సీ పూర్తి చేసిన జాడె ప్రతిమ ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీలో ఎంపీసీ చదివిన అజ్మీరా మనీషా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, బీజెడ్సీ చదువుకున్న భుక్య ఉషారాణి ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో సీట్లు సాధించారన్నారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు ప్రశంసించారు.