27 July, 2026 | 5:37 PM

కీతవారిగూడెం లో కనుల పండగగా గంగమ్మ తల్లి జాతర

27-07-2026 04:44 PM

గంగమ్మకు బోనమెత్తిన గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ 

గరిడేపల్లి, జూలై 27,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో సోమవారం యాదవుల ఆరాధ్యదైవమై కొలువై ఉన్న గంగమ్మ దేవాలయంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మంద గంపలు ఎత్తుకొని బోనాలతో యాదవుల సంప్రదాయాల నృత్యాల తో గుడి ప్రాంగణానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు పసుపు కుంకుమలు సమర్పించారు. అనంతరం భక్తులు యాటలు బలిచ్చి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మహిళా భక్తులతో కలిసి బోనమెత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.

అనంతరం శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో, గంగమ్మ తల్లి ఆలయంలో ఆయనకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గుడి చైర్మన్ చింతకాయల వెంకటేశ్వర్లు, సారె గొల్ల రేఖ వెంకట నర్స్, గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సైదులు యాదవ్, సంఘబుడ్డి నరసయ్య, గంగయ్య, సైదులు,వెంకటేశ్వర్లు పలువురు యాదవ కుల పెద్దలు గ్రామ పెద్దలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు