30 May, 2026 | 9:10 PM

Breaking News

సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •   వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం   •   అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులే   •   కార్మికుల పక్షాన నిలిచే ఏకైక శక్తి, కార్మికులకు అండ, సీఐటీయూ   •  

అక్రిడిటేషన్ కార్డులు,బస్ పాస్‌ల గడువు పొడిగింపు

30-05-2026 07:57 PM

- ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా

కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని,ప్రస్తుతం అమల్లో ఉన్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు,బస్ పాస్‌ల చెల్లుబాటు గడువును మరోసారి పొడిగిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 31తో ముగియనున్న జర్నలిస్టుల బస్ పాస్‌ల గడువును జూన్ 16 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారిక లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల గడువును కూడా జూన్ 16 వరకు పొడిగించిన నేపథ్యంలో, వాటి వ్యాలిడిటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్నలిస్టులందరికీ ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు ఊరట లభించిందని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండీ యాకూబ్ పాషా సూచించారు.