30 May, 2026 | 8:59 PM

Breaking News

చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •   వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం   •   అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులే   •   కార్మికుల పక్షాన నిలిచే ఏకైక శక్తి, కార్మికులకు అండ, సీఐటీయూ   •   రైతుల బావుల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర.. మీటర్ల ఏర్పాటును తిప్పికొడదాం   •   టీయువి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు   •   బైకు కారు ఢీ: వ్యక్తి మృతి   •   ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్   •  

కంకణబద్దులమై శ్రమిస్తున్నాం

30-05-2026 07:54 PM

ఎమ్మెల్యే జి మధు సుదన్ రెడ్డి 

చిన్న చింతకుంట: పేదల సంక్షేమమే ధ్యేయంగా  కంకణబద్దులమై శ్రమిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం  మండలానికి చెందిన అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శనివారం దమగ్నాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహం నందు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు.

​కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు ఆయన అధికారికంగా ఈ ఉత్తర్వులను పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు అందించి తీరుతుందని స్పష్టం చేశారు.

ఎటువంటి రాజకీయ పక్షపాతం లేకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఈ ప్రొసీడింగ్స్ అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ఈ పథకం ఎంతగానో ఊరటనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు  లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే జీఎంఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.