30 May, 2026 | 9:10 PM

Breaking News

సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •   వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం   •   అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులే   •   కార్మికుల పక్షాన నిలిచే ఏకైక శక్తి, కార్మికులకు అండ, సీఐటీయూ   •  

బాలికలు, మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్ హరిత

30-05-2026 08:00 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కలెక్టరేట్‌లో మహిళా వారోత్సవాల సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, బాలికలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఉల్లాస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సిర్పూర్ (యు) మండలానికి చెందిన 74 ఏళ్ల మెస్రం జిజాబాయిని కలెక్టర్ హరిత సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీతారాం, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి ప్రమీల పాల్గొన్నారు.