4 July, 2026 | 10:12 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ప్రతి ఇంటికీ పార్టీ సిద్ధాంతాలు వివరించండి

04-05-2026 01:15 AM

బీఆర్‌ఎస్ నాయకురాలు మాగంటి సునీత గోపీనాథ్

జూబ్లీహిల్స్, మే 3(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని ఆ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇంచార్జి మాగంటి సునీత కార్యకర్త లకు పిలుపునిచ్చారు. బోరబండ, యూసుఫ్ గూడ డివిజనులకు చెందిన బీఆర్‌ఎస్‌బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశాన్ని తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలనున్నారు.

ప్రజలతో పార్టీని అనుసంధానించాలని సూచించారు. ప్రతి గడపకు చేరుకొని పార్టీ విధా నాలపై అవగాహన కల్పించాలన్నారు. అందుకు పార్టీ తరపున అన్ని విధాల సహాయసహకారాలు అందుతాయన్నారు. రాజకీయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా వ్యూహాలను రచించేందుకు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్ గడ్డపై అనూహ్య ఫలితాలను సాధించేందుకు ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజనుల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.