20 June, 2026 | 2:54 AM

భూముల సర్వేకు వేగవంతమైన చర్యలు

20-06-2026 01:48 AM

జిల్లా కలెక్టర్ కె.హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): జిల్లాలో నకలు లేని గిరిజన భూములు, సదా బైనామా దరఖాస్తులు, ఇతర భూ సంబంధిత పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలి పారు. శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తో కలసి కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో కలిసి భూముల సర్వే పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామా ల్లో భూ సమస్యలను గ్రామాల వారీగా గు ర్తించి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వ హణలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన సిబ్బందిని సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని సూచించారు. సదా బైనామా దరఖాస్తులను నెలాఖరులోగా పరిశీలించి అర్హులైన వారికి త్వరితగతిన పరిష్కారం అందించాలని పేర్కొన్నారు.

ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఉన్నతాధికారు ల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. భూ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ అధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

సెల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్ పనులు వేగవంతం చేయాలి:-

జిల్లాలో టెలికాం సేవలను మరింత మె రుగుపరిచేందుకు సెల్ టవర్ల నిర్మాణం, ఆ ప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సంబంధిత అధికారులకు, టెలికాం సంస్థల ప్రతినిధులకు సూచించారు.శుక్రవా రం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి నిర్వహించిన స మీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన మొ బైల్, ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో డిజిటల్ సేవ లు కీలక పాత్ర పోషిస్తున్నందున టెలికాం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.జిల్లాలో ఇప్పటికే మంజూరైన సెల్ టవర్ల నిర్మాణం, ఫైబర్ నెట్వర్క్ విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి, భూ సమస్యలు, అనుమతులు తదితర అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు నిరంతరాయంగా కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు టెలికాం సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ వినయ్, బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్టెల్ తదితర టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.