3 June, 2026 | 10:28 PM

గుంపెల్ల గూడెంలో ఎక్సైజ్ దాడులు

03-06-2026 08:56 PM

సుమారు రూ 2 లక్షల మద్యం స్వాధీనం

కారేపల్లి,(విజయక్రాంతి): ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు రూ.2 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనపరచుకొని అప్పాయిగూడెంలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించినట్లు ఎక్సైజ్ సీఐ ప్రశాంతి తెలిపారు.వివరాల్లోకి వెళితే కారేపల్లి మండల పరిధిలోని గుప్పెల్ల గూడెం గ్రామంలో బుధవారం ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడుల్లో ఓ వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి వివరాలను వెల్లడిస్తామని అన్నారు. కాగా ఇటీవల యదేచ్చగా బెల్ట్ షాపులకు మద్యం తరలించడం పై పలు కథనాలు ప్రచురితం అవడంతో ఎక్సైజ్ అధికారులు ఎట్టకేలకు తనిఖీలు ముమ్మరం చేశారు.