27 July, 2026 | 1:12 AM

వైభవంగా దుర్గమ్మ, మహంకాళి బోనాల మహోత్సవం

27-07-2026 12:17 AM

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ప్రత్యేక పూజలు

ఘట్ కేసర్, జూలై 6 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం నిర్వహించిన దుర్గమ్మ, మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉ పాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం సర్ ఇంచార్జి గజ్జలకాంతం, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్ హా జరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూ జలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు బో నాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, కొండల్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వినోద్ కుమార్, బద్దం జగన్ మోహన్ రెడ్డి, సామల సందీప్ రెడ్డి, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.