27 July, 2026 | 1:12 AM

బీసీల రాజ్యాధికార సాధనకు ఐక్య కార్యాచరణ

27-07-2026 12:15 AM

వివిధ రంగాల నిపుణులతో కీలక సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై 26(విజయక్రాంతి): బీసీల రాజకీయ సాధికారత, తెలంగాణ రా జ్యాధికార పార్టీ బలోపేతం, రానున్న రెండేళ్ల కార్యాచరణపై బీసీ ఎంప్లాయీస్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వివిధ రంగాలకు చెందిన మేధావులతో ఆదివారం ఓ కీలక సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్, సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ దేవళ్ల సమ్మయ్య ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

రాష్ట్రంలో బీసీల సా మాజిక, రాజకీయ పరిస్థితులు, వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం, బీసీల రాజ్యాధికార లక్ష్య సాధనలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోషించాల్సిన పాత్రపై సమావేశంలో చర్చించారు. బీసీల రాజ్యాధికార సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆ యన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ మే ధావులు, వివిధ రంగాల్లో పని చేస్తున్న నిపుణులు,పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

ఇక ఊరూరా టీఆర్పీ గళం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండి గౌస్ పాషా ఆధ్వర్యంలో సిద్ధం చేసిన టీఆర్పీ ప్రచార రథాన్ని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ స్థాయిల్లో పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ రథం ఉద్దేశమని చెప్పారు. జిల్లా అధ్యక్షులు ఎండి గౌస్ పాషా మా ట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కార్యక్ర మంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్ మోహన్ చారి, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, నాగర్‌కర్నూర్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.