సంప్రదాయాల పరిరక్షణకు పండుగలు అద్దం పడతాయి
ఎమ్మెల్యే కసిరెడ్డి
కడ్తాల్, జులై 26 (విజయక్రాంతి): తరతరాల సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కడ్తాల్ మండలంలోని బోయినగుట్ట, గోవిందాయపల్లి, రేఖ్యా తండాల్లో నిర్వహించిన మొలకల పండుగ, బోనాల ఉత్సవాల్లో ఆ యన పాల్గొని పూజలు చేశారు. పండుగలు గ్రామీణుల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. అక్కడినుంచి ఆమనగల్లులో ఓ కాంగ్రెస్ నాయకు ని దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్ గౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదగిరిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, బిచ్చ నాయక్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు






