కాల్వర్టు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు
03-06-2026 08:54 PM
కోనరావుపేట: కోనరావుపేట మండల కేంద్రంలోని ఊరు చివర ఉన్న కాల్వర్టు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన వేముల్ల శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి ఎగ్లాస్పూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, కోనరావుపేట సమీపంలోని కాల్వర్టు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు.
ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన శ్రీనివాస్‌ను 108 సిబ్బంది సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






