ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
- రెండు లక్షలు డిమాండ్ చేసిన సత్యనారాయణ
- అరెస్ట్ చేయడంతో మూర్ఛ వచ్చినట్లు నటించిన నిందితుడు
- కామారెడ్డి జిల్లా బిచ్కుందిలో ఘటన
కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుందలో శుక్రవారం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణను కల్తీకల్లు నిర్వాహకుడి నుంచి డబ్బులు తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కల్తీకల్లు నిర్వాహకులు, బెల్ట్ షాపుల నిర్వాహకులకు ప్రోత్సహిస్తూ నెలసరి మామూ లు వసూలు చేస్తున్నాడు.దీంతో ఓ కల్తీ కళ్ళు బాధితుడు విసిగి వేసారిన అతడు ఏసీబీ అధికారులను సంప్రదించారు.
ఏసీబీ అధికారులు పథకం ప్రకారం శుక్రవారం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ అద్దె ఇంట్లో ఉండగా రెండు లక్షల రూపాయల నగదును బాధితుల నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.దీంతో ఉక్కిరి బిక్కిరి అయిన సీఐ సత్య నారాయణ కింద పడిపోయి మూర్చ వచ్చినట్లుగా నటించాడు. వెంటనే అతనిని ప్రభు త్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి పట్టుబడిన డబ్బులతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు అప్పగించారు.అంతేకాకుండా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 42 వేల రూపాయల నగదు లభించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.ఎక్సైజ్ సీఐ రెడ్ అండ్ రెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టు పడడం జిల్లాలో కలకలం రేపుతుంది.






