14 March, 2026 | 3:40 PM

రైతులకు లాభాలు ఇచ్చే పంట ఆయిల్ పామ్

14-03-2026 02:28 PM

నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రులు

గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్ పామ్

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని(Narmetta Oil Palm Factory) మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao), పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ నెల 22న ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. రూ. 300 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఫ్యాక్టరీని మంత్రులు శనివారం పరిశీలించారు. ట్రయల్ రన్ లో భాగంగా నడుస్తున్న ప్రోసెసింగ్ పరిశీలించారు. గంటకు 30 టన్నుల సామర్థ్యంతో  ప్రాసెసింగ్ యూనిట్ పనిచేయనుంది.

నర్మెట్లలో రైతు మేలా నిర్వహిస్తాం: మంత్రి తుమ్మల


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... రైతులకు పెట్టుబడి, ఎరువులు అన్నీ ఇస్తున్నామని పేర్కొన్నారు. తాను మంత్రిగా వచ్చాక ఆయిల్ పామ్ టన్ను రూ. 12 వేలు ఉండేది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20 వేలకు పైగా పెంచామని వివరించారు. తన తోటలో అనేక పంటలు పడిస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయాలని తుమ్మల పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ తో పాటు ఇతర పంటలను మధ్యలో వేసుకోవచ్చన్నారు. ఆయిల్ పామ్ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్య లేదన్నారు. అన్ని విధాల రైతులకు లాభాలు ఇచ్చే పంట ఆయిల్ పామ్, గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్ పామ్ అన్నారు. నర్మెట్టలో రైతు మేలా నిర్వహిస్తామని తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ కు అనువైన 20 లక్షల ఎకరాల భూమి ఉందని ఆయన వెల్లడించారు.