1 September, 2026 | 9:53 PM

Breaking News

ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •   చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం   •   నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు   •   ఓపీఎస్‌ కోసం రెవెన్యూ ఉద్యోగుల నిరసన   •   కాంగ్రెస్‌ హామీలను విస్మరించింది: భిక్షమయ్య గౌడ్‌   •   ఎన్నికల 100 రోజుల హామీని, 1000 రోజులైనా అమలు చేయని అసమర్థ కాంగ్రెస్   •   సోషల్ మీడియాపై విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   ప్రమాద బాధితుడికి పాఠశాల సిబ్బంది ఆర్థిక సాయం   •  

కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

01-09-2026 | 08:31pm

ములకలపల్లి,(విజయక్రాంతి): హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ అత్యాచారం, హత్యకు గురైన మండలంలోని చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నర్సు ఊకే శిరీష పై జరిగిన లైంగిక అత్యాచారం, హత్యపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మంగళవారం మండల కేంద్రములోని నర్సు ఊకే శిరీష పై లైంగిక అత్యాచారం, హత్యకు నిరసనగా సిఐటియు, ఎస్ఎఫ్ఐ మండల కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆదివాసీ మహిళలకు రక్షణ కరువైందని ప్రభుత్వ పెద్దలు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అణగారిన పేద సామాజిక వర్గానికి చెందిన ఆదివాసీ యువతిపై ఎందుకు ఇంత కక్ష సాధింపులు అదే ఆగ్ర కులాలకు ఒక విధంగా అణగారిన వర్గాలకు ఒక విధంగా ఉంటుందా? ఆదివాసీ సమాజం మౌనం వీడి ఇటువంటి అత్యాచారాలు,హత్యలు మరో మహిళ పై జరగకుండా ఉండాలంటే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ మహ్మద్ సనాఉల్లా అనే రౌడీ మూకలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.మహిళ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

మృతురాలు ఊకే శిరీష కుటుంబానికి ప్రభుత్వం తపురన ఒక 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు. ఊకే శిరీష కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు  పునరావృతం కాకుండా ఊకె శిరీషకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకుండా ఉండాలంటే నేటి  మహిళాలోకం వెంటనే స్పందించి ఊకె శిరీష కుటుంబానికి భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి పాయం అమల, సిఐటియు నాయకులు దుబ్బ ధనలక్ష్మి, ప్రియాంక, పోన్నారి, సీత, వెంకట రమణ, రమాదేవి, ఈశ్వరి, అనిత, కీసరి జయ, సూజత, కొర్రి పద్మ, మీనా, పావని, లాల్ బి,శైలెజ, జ్యోతి, నాగమణి, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.