26 August, 2026 | 1:26 AM

బీసీ వర్గాల సంక్షేమానికి కృషి

26-08-2026 12:00 AM
  1. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
  2. బీసీ వెల్ఫేర్ లెజిస్లేచర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): తెలంగాణ శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం బీసీ వెల్ఫేర్ లెజిస్లేచర్ కమిటీ ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్‌రావు, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసనమండలి, శాసన సభ కార్యదర్శులు నరసింహాచార్యులు, రేండ్ల తిరుపతి, బీసీ వెల్ఫేర్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ని కమిటీ సభ్యులు శ్రీగణేష్, భూపతి రెడ్డి, చింతా ప్రభాకర్, రామారావు పవార్, ఎల్ రమణ, తీన్మార్ మల్లన్నను అభినందించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అత్యంత జనాభా కలిగిన వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీలో తనను సభ్యునిగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, అభివృద్ధికి చైర్మన్ సారధ్యంలో కృషి చేస్తానని తెలిపారు.