మా పాఠశాలలో ప్రతి విద్యార్థి పర్యావరణ ప్రేమకు ప్రతీక
జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు నివేదిత
బాన్సువాడ, జూలై 31 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నివేదిత తన సొంత ఖర్చులతో పాఠశాలలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నివేదిత మాట్లాడుతూ మా పాఠశాలలో ప్రతి యొక్క విద్యార్థి పర్యావరణ ప్రేమకు ప్రత్యేకగా కొనసాగుతున్నారని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క భవిష్యత్ తరానికి పచ్చని భవిష్యత్తు అవుతుందని పచ్చని ప్రకృతిని కాపాడి పచ్చని ప్రపంచాన్ని అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






