31 July, 2026 | 4:17 AM

ప్రతి వాన చినుకును సంరక్షించాలి

31-07-2026 02:16 AM

అలంపూర్, జూలై 30: వర్షపు ప్రతి చుక్కను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని మున్సిపల్ కమిషనర్ పి. రాజేష్ అన్నారు. గురువారం అలంపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి ఇంటి, విద్యాసంస్థ వద్ద రీచార్జ్ పిట్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల వంటగది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీపీవో మణిదీప్, ఆర్‌ఐ రాజశేఖర్, వార్డు అధికారులు ఈశ్వరయ్య, శరత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.