27 July, 2026 | 12:16 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

22-11-2025 04:54 PM

ఆరెందలో గ్రామ కమిటీ ఎన్నికలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్

మంథని (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని మంథని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ అన్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, మంథని డివిజన్ అధ్యక్షులు చీమల సందీప్ సూచన మేరకు మంథని మండలంలోని ఆరెందలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నూతన యూత్ గ్రామ కమిటీని ప్రకటించారు. 

గ్రామ శాఖ అధ్యక్షులుగా కొమ్మిడి నరేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జోడు రాజేష్, ఉయ్యాలా నవీన్, ప్రధాన కార్యదర్శి నూకల రాజేందర్, కార్యదర్శిగా అట్టెం రాజశేఖర్, రసమళ్ళ నవీన్, కోశాధికారిగా బిబ్బర రామకృష్ణ, అధికార ప్రతినిధిగా గాడిపు మనోజ్ కుమార్, ప్రచార కమిటీ కన్వినర్ గా సూరగోన సాయి, మాసిరెడ్డి రాజకుమార్ లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా జోడు రమేష్, కేస్సేటి సుజన, బాలేం మధుకర్, జోడు సాయి కిరణ్, శీలం శ్రీకాంత్, జోడు రాకేష్, భూంపెల్లి రామకృష్ణ, రాతిపెల్లి మధుకర్, ఆరాపెల్లి రాజసమ్మయ్య,  ఆరాపెల్లి సాయి, రాతపెల్లి రాజేంద్ర ప్రసాద్ లను నియమించారు. 

ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నూకల కమల్ మాట్లాడుతూ పార్టీని భలోపేతం చేయడానికి ఉత్సహంగా పనిచెయ్యాలని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలన్నారు. అనంతరం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఉట్ల అనిల్ రెడ్డి, మాజీ సింగల్ విండో డైరెక్టర్ బిబ్బరి కిషన్, మాజీ వార్డ్ మెంబెర్ సభ్యులు మాసిరెడ్డి, లక్ష్మరెడ్డి, జాడి రామస్వామి, మాజీ యూత్ అధ్యక్షులు జోడు రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయుకులు జోడు సద్వాలి, గుండెపు శ్రీనివాస్, కంకణాల సత్యనారాయణ, కొమ్మిడి అరుణ్ రెడ్డి, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, జెరిపోతుల రాజబాపు, నూకల రమేష్, జోడు రాజయ్య, యూత్ కాంగ్రెస్ నాయుకులు కార్యకర్తలు పాల్గొన్నారు.