సమన్వయంతోనే మాదక ద్రవ్యాల నిర్మూలన
కలెక్టర్ రాజర్షిషా సమీక్ష
ఆదిలాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గంజాయి సాగు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ యువరాజ్ మర్మట్ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆయ న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.
మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్ శాఖతో పాటు విద్యాశాఖ, రెవె న్యూ, ఆరోగ్య శాఖలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామా లు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం జరుగు తుందని, విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై చైతన్యం కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో పెయింటింగ్ పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు.
పాఠ శాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, గుట్కాలు, ఇతర మాదక పదార్థాల విక్రయం జరగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ చర్యలు చేపట్టామని వివరించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యా లను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని వివరించారు. రైల్వే స్టేషన్లు, ప్రధాన రహదారుల ద్వారా గం జాయి రవాణా జరగకుండా పోలీస్ బృం దాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మెడికల్ షాపుల్లో నిషేధిత డ్రగ్స్ విక్రయం, దుర్వినియోగం జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తులకు డి-అడిక్షన్ సెంటర్లు, కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నామని, గంజాయి సేవిస్తున్న వారిని యూరిన్ టెస్ట్ కిట్స్ ద్వారా పరీక్షల గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, డిపిఓ రమేష్, వైద్యోరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ హీమాశ్రీ, ఆర్ అండ్ బి ఈఈ నర్సయ్య, ఇతర విద్యా, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




