కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం
మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేతను సన్మానించిన నీలం మధు
పటాన్ చెరు, మే 27 : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాలకూ సమ న్యాయం చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వారసత్వాన్ని గౌరవిస్తూ, ఆమె మనవరాలు చిట్యా ల శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో నూతనంగా నియమితులైన మహి ళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత బుధవారం చిట్కుల్‌లోని ఆయన కార్యాల యంలో ఆమెకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందించారు. నీలం మధు మాట్లాడుతూ తెలంగా ణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, సాయుధ పోరాట యోధులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన సీఎం చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారన్నారు. చిట్యాల శ్వేత మాట్లాడుతూ తనకు ఈ పదవి అప్పగించినందుకు రేవంత్ రెడ్డికి, భట్టికి కృతజ్ఞతలు తెలిపారు.






