30 March, 2026 | 3:27 AM

ప్రత్యామ్నాయ వనరులతోనే పర్యావరణ పరిరక్షణ

30-03-2026 12:00 AM

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మొయినాబాద్, మార్చి 29 (విజయ క్రాంతి): భవిష్యత్తులో ఇంధన కొరతను అధిగమించేందుకు ’బయోమాస్ పెల్లెట్ గ్యాసిఫియర్ స్టవ్’ల వినియోగం ఎంతో అవసరమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్లో జీకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ  సాంప్రదాయ పొయ్యిలతో పోలిస్తే ఈ గ్యాసిఫియర్ స్టవ్ల వల్ల పొగ 90 శాతం వరకు తగ్గుతుందన్నారు. వ్యవసాయ వ్యర్థాలు, రంపపు పొట్టుతో తయారైన పెల్లెట్స్ను ఇంధనంగా వాడటం వల్ల ఖర్చు తక్కువగా ఉండి, మంట ఎక్కువగా వస్తుందని చెప్పారు.  గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని హోటల్ నిర్వాహకులు, ప్రజలు వీటిని వినియోగించాలని కోరుతూ ఎంపీ స్టవ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, వివిధ పార్టీల నాయకులు కంజర్ల ప్రకాష్, సన్వెల్లి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ షాబాద్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.