మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత
- మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): మొక్కలు పెంచటం ద్వారా భూగర్భజలాల పరిరక్షణకు మరియు పర్యావరణ సమతుల్యతకు తోడ్పడవచ్చని వైస్ చైర్ పర్సన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, కమిషనర్ చెన్నబోయిన నాగరాజు అన్నారు. పురపాలక సంఘం పరిధిలో వనమహోత్సవంలో భాగంగా మెగా ప్లాంటేషన్ నిర్వహించిన సందర్బంగా వారు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్ తరాలకు స్వచ్చమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
“మొక్క నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం పచ్చని తెలంగాణను నిర్మిద్దాం" అనే సందేశంతో ప్రజలందరూ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ గుగులోతు రవీందర్ నాయక్, 5వ వార్డు కౌన్సిలర్ నన్నె పంగ శ్రీనివాస్ 7వ వార్డు కౌన్సిలర్ వాస.జ్యోతి, 9వ వార్డు కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, 11వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ షాహీన్,13వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి లక్ష్మయ్య కో-ఆప్షన్ సభ్యులు షేక్ మొగలాభి,మేనేజర్ షేక్ యాకూబ్ పాషా, టీఎంసీ శ్వేత, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది హాజరయ్యారు.






