బింగేశ్వరి ప్రసాద్ మండల్ త్యాగం నిరుపమానం
బీసీ నేత ధనుంజయ నాయుడు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కావాలని మండల్ సిఫా కమిషన్ సిఫార్సులను తయారు చేసి ఆ పోరాటంలో తన ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన బింగేశ్వరీ ప్రసాద్ మండల్ చేసిన త్యాగం నిరుపమానమైనదని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రధాన కూడలిలో బీపీ మండల్ 107వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ పితామహుడిగా, బీసీ ఉద్యమాలకు ఆధ్యుడిగా భారత మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప సింగ్ కు అత్యంత గౌరవనీయుడుగా చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడని,
ఆయన చూపిన బాటలోనే నేడు మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదన్నారు.నేడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నదని గత 12 సంవత్సరాలుగా జనగణనలో కుల గణన చేపట్టకుండా ఏకాభిప్రాయ సాధన పేరుతో వాయిదాలు వేస్తూ వస్తున్నదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రెండు లక్షల కోట్ల నిధులతో కేంద్రంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి బీసీ అభ్యున్నతికి పాటు పడాలని ఉద్యోగస్తులకు ప్రభువు విషయాల్లో రిజర్వేషన్ పాటించాలన్నారు.






