16 June, 2026 | 9:58 PM

కొక్కొండ గ్రామంలో పెద్దమ్మ తల్లికి బోనాలు

16-06-2026 09:05 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని కొక్కొండ గ్రామంలో మంగళవారం గ్రామ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాలను ఊరేగించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ... వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మంగళవారం ఉదయాన్నే మహిళలు చన్నీటి స్థానాలు ఆచరించి వాకిళ్లలో కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి బోనాలను అలంకరించి పెద్దమ్మ తల్లి ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరారు డప్పు వాయిద్యాల మధ్య మహిళలు తలపై బోనాలు పెట్టి అమ్మవారిని నినాదాలు చేస్తూ పూనకాల లో నృత్యాలు చేస్తూ బోనాలను అమ్మవారికి సమర్పించి తమ తమ మొక్కులను నెరవేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.