16 June, 2026 | 9:54 PM

విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు

16-06-2026 09:00 PM

మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్

అధికారులతో మున్సిపల్ పాలకమండలి సమీక్ష

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): వర్షాకాలంలో విద్యుత్ తో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ పాలకమండలి సభ్యులతో విద్యుత్ అధికారులతో   సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం గుట్ట మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో అధికారులతో మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ మాట్లాడుతూ వేసవికాలం పోయి వర్షాకాలం రావడంతో వీధులలో స్తంభాలకు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వీటికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు విద్యుత్ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు. ఎక్కడనైనా విద్యుత్ అంతరాయం కలిగిన విద్యుత్ తీగలు తెగిపడిన స్థంబాలు కూలిపోయిన, చెట్లు  విద్యుత్ తీగల పైన పడిన  వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అధికారులు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఏఈ , సబ్-ఇంజనీర్లు, ఏరియా లైన్‌మెన్లు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.