బార్ కౌన్సిల్ సభ్యురాలు శైలజకు సన్మానం
16-06-2026 08:52 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలు, గోదావరిఖని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ న్యాయవాది సిహెచ్. శైలజను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వొడ్నాల రవీందర్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఏకైక న్యాయవాదిగా సిహెచ్. శైలజ గెలుపొందడం పట్ల బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి శైలజ కృషి చేయాలని అమెను కోరారు.






