తంగళ్లపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.పవిత్ర
16-06-2026 09:12 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. పవిత్ర సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, సేవల అమలును పరిశీలించారు. కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, వాటి అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ, నివేదికల సమర్పణ, సేవల నాణ్యత మెరుగుదలతో పాటు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. డా. పవిత్ర సూచనలతో ఆరోగ్య సేవల అమలు మరింత మెరుగుపడుతుందని వైద్య సిబ్బంది తెలిపారు.






