5 June, 2026 | 2:46 AM

ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించండి

04-06-2026 04:23 PM

దమ్మపేట, జూన్ 04 (విజయక్రాంతి): మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ మండల విద్యాశాఖ అధికారి జగపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎం ఇ ఒ జగపతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు(యూనిఫామ్) , పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజన కల్పన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుందని గ్రామ ప్రజలకు తెలిపారు. ప్రొ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థుల యొక్క వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మొద్దులగూడెం ఎస్టీ కాలనీ  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సర్పంచ్ బేతం రుక్మిణీ, వార్డ్ మెంబర్ కూరం సరస్వతి, ఏ ఎన్ ఎం సుజాత, జి పి ఓ రామక్రిష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.