చెరువు కబ్జా?
ప్రజావాణిలో ఫిర్యాదు
షాద్‌నగర్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెన్జర్లలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. శివారులోని P&G కంపెనీ పక్కన ఉన్న మామిడి చెరువు స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి షెడ్లు నిర్మిస్తున్నారంటూ స్థానికుడు మొయినుద్దీన్ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని చెరువు స్థలాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
పీ అండ్ జీ కంపెనీకి పక్కనే ఉన్న విలువైన చెరువు శిఖం భూమిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి అక్రమంగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ విషయంపై స్థానికులు మొయినుద్దీన్ రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే సర్వే చేసి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మామిడి చెరువు స్థలాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు.






