1 September, 2026 | 1:08 AM

నూతనంగా ఎన్నికైన మహిళా సమాఖ్య కార్యవర్గం ప్రమాణ స్వీకారం

01-09-2026 12:00 AM

గాంధారి, ఆగస్టు 31 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల మహిళా సమాఖ్య 20వ వార్షిక మహాసభ సమావేశాన్ని సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు.. ఈ మహాసభలో మండల మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .

మహిళా సమాఖ్య మండల నూతన అధ్యక్షురాలిగా పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన జి.అంబాలక్ష్మి, సీతాయిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సాయవ్వ కార్యదర్శిగా, ముధోల్లి గ్రామానికి చెందిన జి.గంగామణి లను ఎన్నుకున్నారు.. ఈ మహాసభలకు మండల పరిధిలోని 50 గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు..

జిల్లా సమాఖ్య తరపున జిల్లా కోశాధికారి ఎస్.లక్ష్మి హాజరై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.. ఈ సందర్భంగా ఆమె నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించారు.. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తూ, మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో స్త్రీ నిధి ఆర్.ఎం. కిరణ్, ఏపీఎం ప్రసన్న కుమార్, సీసీ లు గొర్రె రాములు, కపిల,రమేష్, కాశీనాథ్, రమేష్,రాజయ్య, సౌజన్య, అకౌంటెంట్ సుధాకర్  పాల్గొన్నారు.