ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
29-04-2026 08:24 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలో మేకల శ్యామల -యాకూబ్ కుటుంబం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని గృహప్రవేశాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హులైన కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని అన్నారు. గృహ యజమాని శ్యామల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.






