22 July, 2026 | 2:13 AM

ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

22-07-2026 12:53 AM

రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ అధికారుల సూచన

రామారెడ్డి, జూలై 21 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తంఎపిసోడ్-99 కార్యక్రమంలో రైతులకు ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు. అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా కంది, పెసర, మినుము, ఆరుతడి పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో వరి సాగును నివారించాలని భూగర్భ జల శాఖ అధికారులు సూచించినట్లు తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు అవలంబించి పంట దిగుబడులు, రైతుల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ భానుశ్రీ, ఏఈఓ రాకేష్, సర్పంచ్ బండి ప్రవీణ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పశుపతి, ఏఎంసీ డైరెక్టర్ రావుఫ్, ఆత్మ డైరెక్టర్ రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, శేఖర్, రవీందర్ గౌడ్, రంజిత్, లింబాద్రి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.