24 August, 2026 | 3:54 AM

మాట నిలబెట్టుకున్న విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

24-08-2026 02:06 AM

ట్రాన్స్‌ఫార్మర్ వచ్చిన ఆరు నెలల నిరీక్షణకు తెర

విజయక్రాంతి దినపత్రిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రైతులు

మహమ్మదాబాద్ ఆగస్టు 23: మండల పరిధిలోని గత ఆరు నెలల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను దిమ్మెపై ఉంచి కనెక్షన్ ఇవ్వకుండా నిర్లక్ష్యానికి తెరపడింది. దిమ్మె కట్టి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంచి కనెక్షన్ మాత్రం అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేసి రైతులను ఇబ్బందుల గురిచేసిన విషయాన్ని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కి సమాచారం ఇవ్వడంతో వెన్న వెంటనే సంబంధిత శాఖ డీఈ, ఏడి లు స్పందించి సమాచారం ఇచ్చిన ఒక్క రోజులోని సంబంధిత ట్రాన్స్ఫార్మర్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.

దీంతో గత ఆరు నెలలు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన  విద్యుత్ శాఖ అటువైపు చూడకపోవడంతో విజయక్రాంతి దినపత్రిక సమాచారం ఇవ్వడంతో ఆ సమస్య పరిష్కారానికి అధికారులు పరిష్కరించారు.  వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ కు కనెక్షన్ ఇవ్వడం జరిగిందని సంబంధిత రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. ఇదే నంచర్ల గ్రామంలో మూడేళ్ల క్రితం ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల విషయానికి సంబంధించి సంబంధిత అధికారులు ఎందుకో మౌనం మాత్రం వినడం లేదు. ట్రాన్స్ఫార్మర్ మంజూరైనప్పటికీ సంబంధిత రైతులకు మాత్రం ట్రాన్స్ఫార్మర్ రాలేదని మాయమాటలు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.