అన్ని వర్గాలకు అండగా నిలుస్తాం
గౌలిగూడ రామ్ మందిర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
చైర్మన్ వీ కిషన్ యాదవ్, అధ్యక్షులు ఎం రవియాదవ్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడతామని, సాధించుకుంటామని, రాజకీయ పార్టీలకతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి అండగా నిలుస్తామని గౌలిగూడ రామ్‌మందిర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ వీ కిషన్ యాదవ్, అధ్యక్షులు ఏం రవియాదవ్‌లు పేర్కొన్నారు. ఆదివారం గౌలిగూడ రామ్ మందిర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, నూతన కార్యవర్గం ఏర్పాటైంది.
ఈ మేరకు కార్యవర్గాన్ని ప్రకటించారు. చైర్మన్‌గా వీ కిషన్‌యాదవ్, వైస్‌చైర్మన్‌లుగా బీ బాలకిషన్, పీ రమేష్ బాబు, అధ్యక్షులుగా ఏం రవియాదవ్, ఉపాధ్యక్షులుగా వీ మహేష్ గౌడ్, ఆర్ రాజ్ కుమార్, డీ అరవింద్‌యాదవ్( వేణు), ఏం సంతోష్ చారి, రవీందర్ రాజ్ యాదవ్, జనరల్ సెక్రెటరీలుగా వీ సాయిరాం యాదవ్, జీ అశోక్ గౌడ్, కోశాధికారిగా ఎన్ గణేష్ వర్మ, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా టిల్లుయాదవ్, ఎన్ శ్రీనివాస్, వై సాయికుమార్, కే అమృత్‌రావ్, ఏ రాజశేఖర్, జాయిన్ సెక్రెటరీలుగా, జీ శంకర్ గౌడ్, బీ సునీల్, ఎన్ శ్రీకాంత్, డీ గణేష్, కే కిరణ్ కుమార్, లీగల్ అడ్వైజర్లుగా పీ నిత్యానంద్‌యాదవ్, వీ నిషిత గౌడ్, గౌరవ సలహాదారులుగా వై కృష్ణ, ఏం ఆనం ద్ కుమార్ గౌడ్, రాకేష్ జైస్వాల్, ఏం మహే ష్ వర్మ, రవీందర్, ఎన్ ప్రశాంత్, కే శ్రీనివాసులు, పబ్లిసిటీ కన్వీనర్‌గాకే అమర్‌నాథ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.






