పెరిక కుల నూతన కార్యవర్గం ఎన్నిక
మేడిపల్లి మార్చి 1 (విజయక్రాంతి): మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా పెరిక కుల సర్వసభ్య సమావేశం 2026, చెంగిచెర్లలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగిరి మనోహర్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, దాసరి మల్లేశం, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సందేల లింగం, అసోసియేట్ ప్రెసిడెంట్ సుంకరి ఆనంద్,తదితర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరై,నూతన జిల్లా కమిటీ ఎన్నికల కార్యక్రమం మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సోమసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా శ్రీ చింతం రాజేశ్వర్ ,ప్రధాన కార్యదర్శిగా చింతం గిరి వర్మ ,ఉపాధ్యక్షుడుగా కొమిరిశెట్టి శ్రవణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సోమ సాని రాజ్ కుమార్, కోశాధికారిగా మంచా ల నవీన్ రాజా, సెక్రటరీలుగా అంక తి రాజమౌళి, గోదాసు ఉమేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడుగా అంకతి రవి వర్మలను ఎనుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా వ్యాప్తం గా పెరిక కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.




