10 July, 2026 | 10:04 PM

మాల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

10-07-2026 08:32 PM

అధ్యక్షుడిగా సతీష్, ఉపాధ్యక్షుడిగా రాజేందర్

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ గ్రామ మాల కుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆ కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా మూగల సతీష్, ఉపాధ్యక్షుడిగా పొనగంటి రాజేందర్ లను ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సంఘం సభ్యులు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి గా మూగల వెంకట రాజ శేఖర్ , కోశాధికారిగా మూగల శేఖర్ , కార్యదర్శి గా లకుమల్ల నారాయణ, ప్రచార కర్తగా మంత్రి దేవేందర్ లను నియమించారు. నూతనంగా ఎన్నికైన నాయకులు సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. సభ్యులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం సభ్యులు  పాల్గొన్నారు.