10 July, 2026 | 10:04 PM

డా. గడల శ్రీనివాస్ రావు పర్యటనను జయప్రదం చేయండి: మోదుగు జోగారావు

10-07-2026 08:30 PM

ఈనెల 12న జిఎస్సార్  పర్యటన

కొత్తగూడెం,(విజయక్రాంతి)డా. జి. యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొత్తగూడెం ఏజన్సీ ప్రాంతం ప్రజలందరికి విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి ఉచిత మేగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వేలమందికి ఉచిత వైద్యం, అవసరమైన వారికి హైదరాబాద్ లో ఆపరేషన్లు చేయించి, మేగా జాబ్ మేళా ఏర్పాటు చేసి,నిరుపేదలైన వందల మంది నిరుద్యోగులకు కార్పొరేట్ స్థాయి 100 కంపెనిలలో  ఉన్నతమైన ఉద్యోగాలు ఇప్పించి, లక్షల మంది మన్ననలు పొంది అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి, కొత్తగూడెం జిల్లా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసి, ప్రజల మన్ననలు, ఆశీర్వాదాలు పొంది,

ప్రతి గడపకు పెద్ద కొడుకుగా నిలిచి అనేక సేవా కార్యక్రమాలు అందించిన తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్, డా. జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డా. గడల. శ్రీనివాసరావు ఈ నెల 12 ఆదివారం రోజు కొత్తగూడెం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి డా. జి. యస్.ఆర్.ట్రస్ట్ ద్వారా సేవలు పొందిన అభిమానులు, శ్రేణులు, నాయకులు, మహిళలు  డా. శ్రీనివాసరావు అభిమానులు, శ్రేయోభిలాషులు  ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ నాయకులు,అధిక సంఖ్యలో పాలుగొని, విద్యానగర్ కాలనిలోని శ్రీ రామ ఫంక్షన్ హాల్ జరుగు జనసేన ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని   ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు జోగారావు.