22 August, 2026 | 7:00 PM

MRPS, MSP వికారాబాద్ మండలం నూతన కమిటీ ఎన్నిక

22-08-2026 05:52 PM

MRPS మండల అధ్యక్షునిగా ఎర్రం అమర్నాథ్,

అధికార ప్రతినిధిగా పెద్దింటి శ్రీకాంత్

MSP మండల అధ్యక్షులుగా గోవర్ధన్

వికారాబాద్,(విజయక్రాంతి): సెప్టెంబర్ 9న వరంగల్లో జరగబోయే ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీల పరిచయ జాతీయ సదస్సును విజయవంతం చేసుకోవడంలో భాగంగా ఈరోజు స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో అమర్నాథ్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల సమావేశానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్టు పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ హాజరై నూతన కమిటీలను బలపరచడం జరిగింది.

 ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా ఎర్రం అమర్నాథ్, అధికార ప్రతినిధిగా పెద్దింటి శ్రీకాంత్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కౌకుంట్ల దీపక్ మాదిగ ఉపాధ్యక్షులుగా అనిల్ మరియు శ్రీకాంత్ జనరల్ సెక్రెటరీగా పిరంగి విజయ్, సెక్రటరీగా మీనెపల్లి సాయికుమార్ రాజేష్ లను కోశాధికారిగా ప్రశాంత్ లను ఎన్నుకోవడం జరిగింది. మహాజన సోషలిస్టు పార్టీ మండల అధ్యక్షులుగా గోవర్ధన్ మాదిగను అధికార ప్రతినిధిగా మధు మాదిగ మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడిగా మనీ మాదిగను ఎన్నుకోవడం జరిగింది.

 ఈ సందర్భంగా ఆనంద్ మాదిగ గారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెప్టెంబర్ 9న వరంగల్ లో జరగబోయే నూతన మండల కమిటీల పరిచే జాతీయ సదస్సులు విజయవంతం చేసుకోవడంలో భాగంగా వికారాబాద్ జిల్లా నుండి అన్ని నూతన కమిటీలు హాజరు అవ్వాలని దానికి అనుగుణంగా ఎమ్మార్పీఎస్ ను గ్రామస్థాయి  నుండి యువతరంచే పటిష్టంగా నిర్మించి మాదిగ మాదిగ ఉపకులాల హక్కులు ఆత్మగౌరవం సామాజిక న్యాయం కొరకై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముందుండి జాతిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మన పైన ఉన్నదని ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది.