13-02-2026 12:24:57 AM
కోదాడ, ఫిబ్రవరి 12: కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు కత్రం భాస్కర్ రెడ్డి మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన సంతాప సభలో క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాయం పట్టాభి రెడ్డి, బొల్లు రాంబాబు, క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వేనేపల్లి సత్యనారాయణ, ఓరుగంటి రవి, కారుమంచి సత్యనారాయణ, గుండా పునేని వేణుగోపాలరావు, రావెళ్ల సీతారామయ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, మాదాల వెంకటేశ్వరరావు, చింతలపాటి శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.