గంజాయి మత్తులో అఘాయిత్యం
13-07-2026 03:50 PM
జనగామ, జులై 13 (విజయక్రాంతి): జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 78 ఏళ్ల వయసు గల వృద్ధురాలు పై పరుమని రాజేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి మత్తులోనే ఈ లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






