ఎల్ నినో కాంగ్రెస్ సృష్టించిన కరువే
- సీఎం అనుమతితో అక్రమ నీటి తరలింపు
- రాష్ట్ర రైతాంగాన్ని ఆగం చేస్తున్న ప్రభుత్వం
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు
సూర్యాపేట, ఆగస్టు 29 (విజయక్రాంతి): తెలంగాణలో ఎల్ నినో వల్ల కరువు రాలేదని, ముమ్మాటికీ కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కరువే ఇదని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల విఫలపాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న .
నిరసన కార్యక్రమాలను వివరిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో శనివారం సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతు సమాజం ఎంత మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ‘దున్నపోతుపై వాన పడ్డ’ చందంగా వ్యవహరిస్తోందన్నారు.
పాము తన పిల్లలను తానే చంపుకున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






