4 April, 2026 | 3:41 AM

ఖేల్ సంసద్ వేడుకకు రండి

04-04-2026 01:59 AM

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో బీజేపీ ఎండీ డీకే అరుణ శుక్రవారం భేటీ అయ్యారు.  మహబూబ్‌నగర్‌లో ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని గవర్నర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ నెల 9 నుంచి 24 వరకు నిర్వహించే క్రీడా మహోత్సవ కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందిస్తూ 24న మహబూబ్‌నగర్ వేదికగా జరిగే ముగింపు వేడుకకు హాజరవుతానని చెప్పినట్టు డీకే అరుణ తెలిపారు.