7 May, 2026 | 3:29 AM

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

07-05-2026 01:41 AM
  1. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు పంపుతాం   
  2. కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): కుకింగ్ గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటు న్న సమస్యలను నెల రోజులలోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కార్మిక శాఖ కార్య దర్శి దాసరి హరి చందన హామీ ఇచ్చారు. తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సలహాదారు కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టీ.చిరంజీవులు, కమిటీ నాయకులు చామకూర రాజు, అధ్యక్షులు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శులు అజయ్ రెడ్డి,

నగేష్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు యునుస్ ఎల్‌పీజీ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను బుధవారం సచివాలయంలో కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్లు సరఫరా చేసే కార్మికులకు కనీస జీతాలు చెల్లించడం లేదని, ఈఎస్‌ఐ, పీఎఫ్ ఇవ్వడం లేదని టీ.చిరంజీవులు కార్యదర్శి హరిచందనకు వివరించారు. 

ఈ సందర్భంగా కార్యదర్శి హరిచందన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్లకు కార్మిక శాఖ తరపున నోటీసులు పంపిస్తామని, డిస్ట్రిబ్యూటర్లతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామ ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 806 గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషనర్లు ఉన్నారని, వారు కార్మిక శాఖ ఇతర ప్రభుత్వ శాఖనియమాలను పాటించ కుండా కార్మికుల శ్రమదోపిడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐడెంటిటీ కార్డులు అపాయింట్మెంట్ లెటర్ కూడా కనీసం ఇవ్వడం లేదని ఆయన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు.