రోడ్డు పై గుంతల పరిష్కారానికి కృషి
అధికారులతో కలిసి పర్యవేక్షించిన తుంగతుర్తి రవి
మేడిపల్లి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి 9వ డివిజన్ ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ నుండి పర్వతపూర్ సిపిఆర్‌ఐ రోడ్డులోని సాయి ఐశ్వర్య కాలనీ వరకు ఉన్న ప్రధాన రహదారి అధ్వాన్నంగా తయారై, గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి మంగళవారం మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు రోడ్డు వేసినప్పటికీ, డ్రైనేజీ, వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోవడం వల్ల తరచూ గుంతలు పడుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో గుం తలు పడకుండా చూడాలని అధికారులతో మాట్లాడి పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




