27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

బాధితులకు అండగా ఉంటాం : కామారెడ్డి ఎమ్మెల్యే

05-05-2026 12:49 AM

కామారెడ్డి, మే 4 (విజయక్రాంతి): కామారెడ్డి పాత బస్టాండ్ లో శనివారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ సంభవించి అగ్ని ప్రమాదంలో 23 దుకాణాల యజమానులు సర్వం కోల్పోయారు. వారిని సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరామర్శించారు. బాధితులకు నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని  హామీ ఇచ్చారు.

బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత వ్యాపారులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు తమ దుకాణాలను నడుస్తూనే కుటుంబాలు పోషించుకునే వారమని తమ దుకాణాలు సర్వం కోల్పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ను కోరారు. టి పి సి సి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు.

అగ్ని ప్రమాదం జరిగిన విషయం బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చిరు వ్యాపారులకు హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదం వల్ల సర్వం కోల్పోయామని తమ కుటుంబాలు రోడ్డును పడ్డాయని బాధితులు చంద్రశేఖర్ రెడ్డికి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందే విధంగా కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూలూరు సుధాకర్, కౌన్సిలర్ మహేష్, సలీం, రవీందర్ గౌడ్, రంగా రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.